![]() |
![]() |
.webp)
కుర్చీ మడతబెట్టి .. అని ఆ తాత ఏ ముహుర్తానో అన్నాడో గానీ ఎక్కడ చూసిన అదే మ్యూజిక్ అదే బాదుడు. 'గుంటూరు కారం' సినిమాలో థమన్ మామ ఆ డైలాగ్ కి తగ్గట్టుగా బీట్ చేయడం.. దానికి తగ్గట్టుగా మహేశ్ బాబు, శ్రీలీల అదిరిపోయే స్టెప్స్ వేయడంతో ఈ పాట మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఎప్పుడు అయితే ఈ పాట మొదలైందో అప్పటి నుండి ఇదే మ్యూజిక్.. అవే స్టెప్స్. ఎక్కడ లేని జనాలంత ఇన్ స్ట్రాగ్రామ్ పై దాడి చేసినట్టుగా .. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ట్రెండింగ్ ని ఫాలో అవుతున్నారు. అయితే ఈ ట్రెండింగ్ గురించి హిమజ ఓ సన్సెషనల్ కామెంట్ చేసింది.
హిమజ తాజాగా ఓ ఇష్యూతో ఒక్కసారిగా వైరల్ గా మారి వార్తల్లోకొచ్చింది. ఇక ఇప్పుడు ఆ వైరల్ గా పొడిగిస్తూ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ క్రమంగా ఫేమస్ అయ్యింది నటి హిమజ. నటిగా మంచి పేరు తెచ్చుకొని కొన్ని సీరియళ్లలోను నటించింది. వీటితో పాటు పలు టీవీ షోలు కూడా చేసింది హిమజ. అయితే, బిగ్‍బాస్ ద్వారా ఆమె చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో నటించింది. హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది.
ట్రెండింగ్ ని ఫాలో అయ్యేవారి మీదకి ఓ సెటైర్ వేసింది హిమజ. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. కుర్చీ మడతబెట్టి.. మడతబెట్టి అనే మ్యూజిక్ మొదట ప్లే అవ్వగా.. అయిపోయిందా .. మడతబెట్టిర్రా కుర్చీనీ.. మీ అందరి ఇంట్ల ఓ కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీ పైన బట్టలు పడేసి ఉంటాయి. ఫస్ట్ పోయి ఆ బట్టలు మడతబెట్టండి. కుర్చీ మడతబెడతారంట.. ఎన్నడైనా బట్టలు మడతబెట్టిర్రారా మీరు.. ఏదైన ఒక ట్రెండింగ్ మొదలయ్యిందంటే చాలు ఒకటే మ్యూజిక్.. ముందు బట్టలు మడతబెట్టండి అని హిమజ అంది. తను అన్న ఈ మాటలు ట్రెండింగ్ ని ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరిని ఉద్దేశించి చెప్పడంతో ఈ పోస్ట్ కి కామెంట్లు తెగ వస్తున్నాయి. అయితే ఇందులో పాజిటివ్ తో పాటు నెగెటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. మరి హిమజ వీటికి ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు ఈ వీడియో ఇన్ స్ట్రాగ్రామ్ లో వైరల్ గా మారింది.
![]() |
![]() |